మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి గానే పరిగణించాలి: మంత్రి లోకేష్

by Malleboina Mahesh |   (  Updated:2025-06-28 12:54:19  IST  )

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (phone tapping) పై తెలుగు మీడియా ఛానల్ అయిన మహా న్యూస్.. ఇటీవల వరుస కథనాలను చేస్తుంది.

మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి గానే పరిగణించాలి: మంత్రి లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (phone tapping) పై తెలుగు మీడియా ఛానల్ అయిన మహా న్యూస్ (Maha news ).. ఇటీవల వరుస కథనాలను చేస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత కథనాలు ప్రసారం చేశారని ఆరోపిస్తూ.. తెలంగాణ బీఆర్ఎస్వీ (BRSV) అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇతర నాయకులు మహా న్యూస్ కార్యాలయం వద్ద నిరసనకు దిగాయి. అయితే కొద్ది సేపటికి ఈ నిరసన కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు (BRS leaders) ఒక్కసారిగా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ నాయకులు కూడా గాయపడ్డారు. కాగా ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు స్పందిస్తూ.. తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh).. న్యూస్ ఛానెల్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

అందులో.. "హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి.‌ మహా టీవీపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కథనాలు,ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే, తెలియజేయవచ్చు. వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు క్షమార్హం కాదు. మహా యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నాను." అని రాసుకొచ్చారు. అంతకు ముందు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ దాడిపై స్పందిస్తూ.. బీఆర్ఎస్వీ తీరును ఖండించారు.

Next Story