Cm Chandrababu: ఢిల్లీకి బయల్దేరిన సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..!

by Vemula.Srinu Prasad |

దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు బయల్దేరారు....

Cm Chandrababu: ఢిల్లీకి బయల్దేరిన సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)కి ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) బయల్దేరారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారంలో గురువారం ఆయన పాల్గొననున్నారు. అనంతరం పలువురు కేంద్ర పెద్దలను కలవనున్నారు. హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లతో భేటీ అవకాశం ఉంది. హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా చంద్రబాబు భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ఆర్థిక సాయంపై చర్చించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు చంద్రబాబు పర్యటనకు ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే సీఎం చంద్రబాబు నాయుడును కూటమి ఎంపీలు కలవనున్నారు. ఈ రాత్రికి బస చేసి గురువారం కూటమి నేతలతో కలిసి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనున్నారు.

Next Story