- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ ప్రచారంపై ఏపీ క్లారిటీ.. తెలంగాణకు పోలీసులు వెళ్లలేదన్న ఫ్యాక్ట్ చెక్
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇదంతా అసత్య ప్రచారమని, ఈ తరహా వదంతులను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఇటీవల ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై ఏపీలో పలు చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే.
అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు!
ఈ రాజకీయ ఆరోపణలు, కేసుల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఏపీ పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ఏపీ పోలీసులు ఇప్పటికే తెలంగాణకు చేరుకున్నారన్న వార్తలతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు.. ముందస్తు జాగ్రత్తగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి చేరుకుని ఆయనకు రక్షణ కల్పించారు.
ఖండించిన ఏపీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం
అయితే, ఈ అరెస్ట్ వార్తలపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం మంగళవారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించి క్లారిటీ ఇచ్చింది. అరెస్ట్ ప్రచారాన్ని కొట్టిపారేసింది. ‘ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చేరుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అసత్యం. అలాంటిదేమీ జరగలేదు. కొందరు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారు. ఈ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఫ్యాక్ట్ చెక్ విభాగం తన పోస్టులో పేర్కొంది. మరోవైపు, ఈ ఫ్యాక్ట్‌చెక్ పోస్టును అధికార తెలుగుదేశం పార్టీ (TDP) సైతం తమ అధికారిక ఖాతాలో రీపోస్టు చేయడం గమనార్హం.






