- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ముంబై నటిపై అక్రమ కేసు.. పౌర హక్కుల సంఘం సీరియస్
by Vemula.Srinu Prasad |
ముంబై నటిని వైసీపీ నేత విద్యాసాగర్ మోసం చేసి చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి వేధించిన ఘటన ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది...

X
దిశ, వెబ్ డెస్క్: ముంబై నటిని వైసీపీ నేత విద్యాసాగర్ మోసం చేసి చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి వేధించిన ఘటన ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. అక్రమంగా కేసులు పెట్టడం వెనుక ఇద్దరు ఐపీఎస్ అధికారులు, జగన్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనపై ఏపీ పౌర హక్కుల సంఘం సీరియస్ అయింది. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తోంది. వైసీపీ నేతలు, పోలీస్ అధికారులపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన కోరారు. బాధితులిపై పెట్టిన తప్పుడు కేసులపైనా సమగ్ర విచారణ జరపాలన్నారు. వైసీపీ నేత విద్యాసాగర్‌పైనా సీబీఐతో విచారణ జరిపించాలని ముప్పాళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Next Story






