- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP | పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న చంద్రబాబు సర్కార్
ప్రతి పేద, మధ్య తరగతి వారికి సొంతింటి కల (Own House Dream) ఉంటుంది. తమదైన ఇంట్లో ఉండాలని.. తమ కుటుంబంతో ఆనందంగా జీవించాలని కలలు కంటారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి పేద, మధ్య తరగతి వారికి సొంతింటి కల (Own House Dream) ఉంటుంది. తమదైన ఇంట్లో ఉండాలని.. తమ కుటుంబంతో ఆనందంగా జీవించాలని కలలు కంటారు. కానీ పేదరికం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా దానిని సాకారం చేసుకోలేరు. అటువంటి పేదల కోసం సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రభుత్వం ముందడుగు వేసింది. టిడ్కో ఇండ్లను కట్టిస్తూ పేద, మధ్య తరగతి వారి కలలను సాకారం చేస్తోంది. సొంతింటి కలను నెరవేర్చేందుకు అంకితభావంతో పని చేస్తోంది. 2019 నాటికి టీడీపీ హయాంలో 90 శాతం అంటే 81,040 ఇళ్లు, 75-90 శాతం మధ్య 71,488 ఇళ్లు, 25-75 శాతం మధ్య 38,416 ఇళ్లు, 25 శాతం దిగువన 1,22,888 ఇళ్ళను నిర్మించింది. మొత్తం 3,13,832 ఇళ్లను ప్రారంభించారు.
టిడ్కో గృహాల నిర్మాణంపై దృష్టి
చంద్రబాబు నాయుడు సర్కారు టిడ్కో గృహాల (TIDCO Houses) నిర్మాణంపై దృష్టి సారించింది. పేదలకు చిరకాల స్వప్నంలా నిలిచిన సొంతింటి కలను సాకారం చేసేందుకు గట్టి చర్యలు చేపట్టింది. గతంలో నిలిపేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని 17 నెలల్లో పూర్తి చేసి లక్షలాది కుటుంబాలకు తాళాలను పంపిణీ చేసింది. ఏపీ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి నారాయణ సమక్షంలో ఇళ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షిస్తోంది.
విభిన్న శ్రేణులలో ఇండ్లు
300, 365, 430 చదరపు అడుగుల విభిన్న శ్రేణులలో ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా పని చేస్తోంది. గత ప్రభుత్వ కాలంలో అప్పుల క్రింద ఉండి ఆగిపోయిన నివాస పనులను చంద్రబాబు సర్కారు వచ్చిన తరువాత రూ. 140 కోట్లు అప్పులను చెల్లించి పునరుద్ధరించారు.
మూడు సంవత్సరాల్లో 17లక్షల ఇండ్లు
రానున్న మూడు సంవత్సరాల్లో 17 లక్షల ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. వీలైనంత త్వరగా టిడ్కో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అన్ని చర్యలను ప్రభుత్వం తరపును తీసుకొంటున్నారు. గత ప్రభుత్వ తీరు కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కేంద్ర నిధులను రాబట్టుకుంటూ పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తోంది. తద్వారా కుటుంబాలకు ఒక ధీమాను, భవిష్యత్తు తరాలకు భరోసాను కల్పిస్తోంది.
సొంత స్థలంలో అవకాశం
సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సొంత భూమి లేనివారికి ఇండ్లను కట్టిస్తోంది. అదే విధంగా స్థలం ఉన్నవారికి ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తోంది. తద్వారా పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, కూటమి ప్రభుత్వ పాలనలో ఇక సొంతింటి కల కలగా మిగిలిపోదనే సందేశాన్ని చేతల ద్వారా తెలియజేస్తోంది.






