- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Cabinet Meeting: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) కొనసాగుతోంది. ఈ భేటీలో కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. SIPB సూచించిన 11 సంస్థల పెట్టుబడులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) కొనసాగుతోంది. ఈ భేటీలో కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. SIPB సూచించిన 11 సంస్థల పెట్టుబడులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్రానికి రూ.33 వేల కోట్ల పెట్టుబడులతో పాటు.. 35 వేల ఉద్యోగాలు రానున్నాయి. లెదర్ ఫుట్ వేర్ పాలసీ (Lether Footwear Policy)4.0కు, ఏపీకి పొట్టి శ్రీరాములు వర్సిటీ (Potti Sriramulu Versity) తరలింపునకు, లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
భోగాపురం ఎయిర్ పోర్టు (Bhogapuram Airport) వద్ద సిటీసైడ్ అభివృద్ధికి 500 ఎకరాలు, సత్యసాయి, కడప జిల్లాల్లో అదానీ కంపెనీకి భూములను కేటాయించింది. అలాగే నెల్లూరు జిల్లాలో ఏపీఐఐసీకి 615 ఎకరాలను కేటాయించింది. రాష్ట్రంలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అనుమతిచ్చింది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ 12 నాటికి ఏడాది పూర్తి కానుండగా.. ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల బదిలీలపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.






