ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం: రూ.39,436 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్..!

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం: రూ.39,436 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా SIPB ప్రతిపాదించిన భారీ పెట్టుబడులకు కేబినెట్ అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది. రూ.39,436 కోట్ల విలువైన మొత్తం 31 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టనుంది.

రాజధాని విషయంలో...

ఈ సమావేశంలో ప్రధానంగా అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి, సంబంధిత చట్టాల ఆమోదానికి ధన్యవాదాలు తెలుపనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందిస్తున్న వెన్నుదన్నుపై కేబినెట్ హర్షం వ్యక్తం చేయనుంది. దీంతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ కంపెనీలు పెట్టనున్న పెట్టుబడులకు ఈ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

కొత్త ఉద్యోగాల కల్పనపై..

రాష్ట్రంలో సుమారు 1.11 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగాల కల్పన, రాయలసీమను సోలార్ హబ్‌గా మార్చడం, విశాఖలో ఐటీ అభివృద్ధి వంటి అంశాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాలపై కూడా ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Next Story