AP | దేవాలయాల్లో తొక్కిలాసటల నివారణకు మంత్రివర్గ ఉపసంఘం

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాల్లో (AP Temples) తొక్కిసలాటల ఘటనల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.

AP | దేవాలయాల్లో తొక్కిలాసటల నివారణకు మంత్రివర్గ ఉపసంఘం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాల్లో (AP Temples) తొక్కిసలాటల ఘటనల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘం (Cabinet Sub Committee) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాట నివారణకు ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఈ ఉప సంఘాన్ని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి వర్గ ఉపసంఘంలో సభ్యులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ (YCP Govt) హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులు జరిగిన ఘటనకు సంబంధించి తీసుకున్న చర్యలు సమీక్షించాలని కమిటీకి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2019-24 మధ్యలో దేవాలయాలపై దాడులు జరిగాయి. ఆ ఘటనలపై తీసుకున్న చర్యలపై సమీక్షించాలని ప్రభుత్వం ఉపసంఘాన్ని ఆదేశించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖకు ప్రభుత్వం సూచించింది.

Next Story