- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించనున్న కీలక అంశాలు ఇవే..!
దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు (మంగళవారం) ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనున్నట్లు టాక్. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ ఆర్డినెన్స్‌ను మంత్రి మండలి ఆమోదించనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్న బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలపై మంత్రులు డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఇసుక పాలసీ విధివిధానాలపై కేబినెట్ మరోసారి చర్చించనున్నట్లు టాక్.
తల్లికి వందనం, ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన గైడ్ లైన్స్‌పైన మంత్రి మండలి చర్చలు జరపనున్నట్లు సమాచారం. వీటితో పాటుగా రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు.. ఈ టూర్‌కు సంబంధించిన ఏజెండాను మంత్రులకు వివరించనున్నట్లు తెలుస్తోంది. కాగా, రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఎన్డీఏ కూటమిలో కీ రోల్ ప్లే చేస్తోన్న బాబు రేపు ఢిల్లీకి వెళ్లనుండటంతో ఆయన హస్తినా పర్యటనపై స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తి నెలకొంది. అమిత్ షాతో చంద్రబాబు ఏ అంశాలపై చర్చిస్తారని ఉత్కంఠ నెలకొంది.