AP News : రేపు ఏపీ కేబినెట్ సమావేశం

by Muthe.Rajitha |

రేపు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం(AP Cabinet Meeting) జరగనుంది.

AP News : రేపు ఏపీ కేబినెట్ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : రేపు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం(AP Cabinet Meeting) జరగనుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అమరావతి రాజధాని ప్రాంతంలో 20,494 ఎకరాల భూ సమీకరణ(Land Pooling)కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి, లేమల్లె, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల నుంచి ఈ భూ సమీకరణ జరుగనుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ భూమిని వినియోగించనున్నారు.

జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(NGT), సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రైతులకు మెరుగైన పరిహార ప్యాకేజీ అందించేందుకు పలు నిర్ణయాలు తీసుకొనున్నారు. అలాగే ఈ కేబినెట్ సమావేశం అమరావతిలో ఏర్పాటు చేయబోయే నాలుగు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఇవి వాణిజ్య, సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహించడానికి ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై చర్చ జరిపి, రెండు కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు కూడా ఆమోదం ఇవ్వనున్నారు.

Next Story