- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై చర్చలు
ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఇవాళ(బుధవారం) కేబినెట్ భేటీ జరగనుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఇవాళ(బుధవారం) కేబినెట్ భేటీ జరగనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం(AP Cabinet Meeting) ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ(APSRTC) ఉచిత బస్సు ప్రయాణం పై చర్చించనున్నారు.
ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆగస్టు 15 నుంచి అమలు కు ఆమోదం తెలపనున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా పేరును ఖరారు చేసి ప్రకటిస్తారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం తెలపనున్నారు. ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదికపై చర్చించనున్నారు. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, నాలా చట్ట సవరణ, ఎల్ఆర్ఎస్ పై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, మంత్రులు సింగపూర్ పర్యటన, లిక్కర్ కేసులు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహణపైనా చర్చించనున్నారు. అనంతరం పీ 4 కార్యక్రమం పై ఈరోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.






