కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. సంచలన నిర్ణయాలు తీసుకునే చాన్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-10 03:04:45  IST  )

సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11.30కి కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. సంచలన నిర్ణయాలు తీసుకునే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11.30కి కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రులు, సీఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు హాజరుకానున్నారు. సమావేశంలో భాగంగా సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖ (Vishakha)లో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్‌తో రూ.87,520 కోట్ల విదేశీ పెట్టుబడికి ఆమోదం తెలుపనున్నారు. SIPB ద్వారా రానున్న రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఓకే చెప్పనున్నారు.

రాష్ట్రంలో మొత్తం 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మంది యువతకు ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉంది. అమరావతి (Amaravati)లో రూ.212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్‌భవన్ (Raj Bhavan) నిర్మాణానికి ఆమోదం తెలుపనున్నారు. దీంతో కృష్ణా నది ఒడ్డున ప్రభుత్వ కాంప్లెక్స్‌లో రాజ్‌భవన్ నిర్మాణం జరగనుంది. ఇక మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో.. భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి సీఆర్‌డీఏ (CRDA)కు 25 శాతం నిధులు కేటాయించానున్నారు. అదేవిధంగా రాజధాని అమరావతి ప్రాంతంలో నాలుగు కన్వెన్షణ్ సెంటర్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

Next Story