- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Amaravati: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే..?

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర సచివాలయం వేదికగా ఈ భేటీకి అన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం(Cabinet meeting) జరగనుంది. ఈ భేటీలో అమరావతి రెండో విడత భూసేకరణపై చర్చించనున్నారు. అలాగే సీఆర్డీఏ(CRDA) ఆమోదించిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి టెండర్లు ఆమోదించనున్నారు. రాజధాని(Capital) అభివృద్ధి కోసం మరోసారి భూములు సేకరించాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని కూడా ఈ భేటీలో చర్చించి రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశానికి కూడా పచ్చజెండా ఊపనున్నారు. రాష్ట్రంలో కొత్తగా రానున్న పెట్టుబడులు, ఉద్యోగల కల్పనపై చర్చించి ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. ఐటీ కంపెనీలకు నామ మాత్రపు ధరలకే భూములివ్వాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో మరోసారి చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉందని కూటమి నాయకులు చెబుతున్నారు