కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!

by Kema Shiva Kumar |

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chadrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సరిగ్గా ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం (Cabinet Meeting) జరగనుంది.

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chadrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సరిగ్గా ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం (Cabinet Meeting) జరగనుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానంద్‌తో పాటు ప్రభుత్వ సలహాదారులు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా రాజధాని అమరాతికి నిర్మాణానికి భూ సేకరణపై కూడా డిస్కస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందకు వచ్చిన పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోద ముద్ర వేయనున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) ఐటీ కంపెనీల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లుగా సమాచారం.

Next Story