Breaking: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-07 11:39:18  IST  )

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది...

Breaking: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్:ఏపీ కేబినెట్(Ap Cabinet) భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఈ భేటీ రెండు గంటలపాటు సాగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాకినాడ(Kakinada)లో టూరిజం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పర్యటక శాఖకు 115 ఎకరాలు కేటాయింపుపై భేటీలో చర్చించారు. అలాగే 2024-29 రాష్ట్ర టూరిజం ల్యాండ్ అలాట్ మెంట్ పాలసీపైనా చర్చించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని గతంలో నిర్ణయించారు. ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. గీత కులాల మధ్యం షాపుల్లో సొండి కులాలకు 4 షాపులు కేటాయించే అంశంపై చర్చించారు. డీపీవోల కేడర్ క్రమబద్ధీకరణపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనలపై చర్చించారు. డీపీవోలు నేరుగా రిపోర్టు చేసేలా కేడర్‌లో మార్పుల అంశంపైనా కేబినెట్ భేటీలో చర్చించారు.

ప్రజలకు పౌరసేవలు నేరుగా అందించేలా కేడర్‌లో మార్పులకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025పై ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనలపై చర్చించారు. కుప్పం నియోజకవర్గంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుపై ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రాతిపాదనలపైనా చర్చించారు. వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలపైనా మంత్రులు ఈ భేటీలో చర్చించారు. 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలపైనా చర్చ జరిగింది. సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి ఉచితంగా భూమి కేటాయింపు, రాజమండ్రి వ్యవశాయ కళాశాల నిర్మాణానికి ఉచితంగా భూమి కేటాయింపు అంశంపైనా చర్చించారు.

Next Story