- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు.. గీత కులాలకు గుడ్ న్యూస్
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్(Ap Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 14 అంశాలకు మంత్రులు ఆమోదం తెలిపారు. గీత కులాల(Gita castes)కు 336 వైన్ షాపుల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎకనామిక్ బోర్డు(Economic Board)లో 22 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. తమ్మవరం పర్యాటక కేంద్రం(Tammavaram Tourist Center) అభివృద్ధికి 66.12 ఎకరాలు కేటాయింపునకు పచ్చ జెండా ఊపారు. రాజమండ్రి పాత వంతెనను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మంత్రుల ఆమోద్రముద్ర పడింది. ధవళేశ్వరంలో వ్యవసాయ కాలేజీకి భూమి కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే విజయనగరం జిల్లాలో టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. ఎమ్ఎస్ఎమ్ఈ పార్క్ ఏర్పాటుకు రూ.27.26 ఎకరాల కేటాయింపునకు మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు మరిన్ని అంశాలకు సైతం రాష్ట్ర మంత్రులు ఆమోద్ర ముద్ర వేశారు. రూ.5.34 కోట్లతో కుప్పంలో డిజిటల్ హెల్త్ సెంటర్ ఏర్పాటుతో పాటు ఏపీ ప్రైవేటు వర్సిటీల బిల్లు, పంచాయతీరాజ్ శాఖలో హోదాల సరళీకరణ, ఖనిజాభివృద్ధి సంస్థకు రూ. 9 వేల కోట్ల సమీకరణకు కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడింది.






