రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచేలా పాలసీలు : మంత్రి పార్థసారథి

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచేలా పాలసీలను రూపొందిస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి (Minister Pardhasaradhi) తెలిపారు.

రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచేలా పాలసీలు : మంత్రి పార్థసారథి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచేలా పాలసీలను రూపొందిస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి (Minister Pardhasaradhi) తెలిపారు. గురువారం క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాల (AP Cabinet Decisions) గురించి ఆయన వివరించారు. ఈ భేటీలో ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీనివల్ల పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. ఈ పాలసీతో ఇప్పటికే యూపీ, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు లబ్ధిపొందాయని, ఏపీలో ఇలాంటి స్పెషల్ పాలసీ లేకపోవడం వల్లే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రావడం లేదన్నారు.

రాష్ట్రంలో సుమారు 150 బిలియన్ డాలర్ల వ్యాపారమే లక్ష్యంగా విధానాన్ని రూపొందించామని తెలిపారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని పరిశ్రమలు ఆసక్తి చూపిస్తున్నాయని, విశాఖలో సిఫి సంస్థ రూ.16,466 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. సదరు సంస్థకు మధురవాడలో 3.6 ఎకరాలు ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదించిందని వివరించారు.

Next Story