Rajadhani: రెండో విడత భూ సమీకరణకు.. తొలివిడత నిబంధనలే..! ఏపీ కేబినెట్​ నిర్ణయాలివే...

by Thanuru Gopichand |   (  Updated:2025-06-24 09:58:57  IST  )

ఏపీ సచివాలయంలో ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.

Rajadhani: రెండో విడత భూ సమీకరణకు.. తొలివిడత నిబంధనలే..! ఏపీ కేబినెట్​    నిర్ణయాలివే...
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : ఏపీ సచివాలయంలో ఈ రోజు సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) జరిగింది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయింది. దాదాపు 42 అంశాలతో అజెండాను రూపొందించారు. వాటిని కేబినెట్​సమావేశంలో ఆమోదించారు. ఈ రోజు జరిగిన కేబినెట్​సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో (Amaravathi) మలివిడత చేపడుతున్న భూ సమీకరణపై మంత్రి వర్గంలో చర్చ జరిగింది. తొలివిడత నిబంధనలే మలివిడత భూ సమీకరణకు వర్తింపజేయాలని నిర్ణయించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు ఇన్​చార్జి మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఆ తర్వత నియోజకవర్గ స్థాయిలో జరపాలన్నారు.

ఏడాది లోగా సమస్యలన్నీ పరిష్కరించాలని సీఎం తేల్చి చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులుంటే తనతో మాట్లాడవచ్చాన్నారు. సాంకేతిక సమస్యల సాకుతో దాటవేత ధోరణి సరికాదన్నారు. సుపరిపాలన కార్యక్రమాన్ని జూలై ఒకటి నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికీ తీసుకు వెళ్లాలని ఆదేశించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ, విరాళలకు ప్రత్యే కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. ముఖ్యంగా అమరావతిలో పరిపాలన భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న పలు సంస్థలకు అనుమతులు మంజూరు చేశారు. రూ.882.47 కోట్లతో జేడీ టవర్, రూ.1,487.11 కోట్లతో హెచ్​వోడీ కార్యాలయాలకు ఆయా సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి.

రూ.1303.85 కోట్లతో ఇతర పరిపాలన భవనాల నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థలకు మంత్రివర్గం అనుమతులు మంజూరు చేశారు. పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్​స్ట్రక్టర్ల పోస్టుల అప్​గ్రేడ్​కు ఆమోదం తెలిపారు. ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ భూ కేటాయింపు పై చర్చించారు.ఎకరా రూ.50 లక్షలు చొప్పున జరిగిన భూ కేటాయింపు నిర్ణయంపై మంత్రివర్గంలో పున సమీక్షించారు. చదరపు మీటరు రూపాయికి తగ్గించే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో మరో 7 అన్న క్యాంటీన్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఏపీ భవన నిర్మాణ చట్టంలో పలు నిబంధనలు సవరణలకు మంత్రివర్గం ఆమోదించింది.

అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఆయనకు డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం కల్పించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఇటీవల ఎస్ ఐపీబీ లోని నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో ఐటీ సంస్థ కాగ్నిజెంటుకు భూ ప్రతిపాదనపై చర్చించారు. 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలు కేటాయించే ప్రతిపాదనపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రూ.1,582.98 కోట్ల పెట్టుబడులతో ఎనిమిది వేల మందికి కాగ్నిజెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.

Next Story