- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఎట్టకేలకు జిల్లాల పునర్విభజన (Districts Re-Organization) అంశం ఒక కొలిక్కి వచ్చింది. సోమవారం జరిగిన ఏపీ కేబినెట్ (AP Cabinet) సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు జిల్లాల పునర్విభజన (Districts Re-Organization) అంశం ఒక కొలిక్కి వచ్చింది. సోమవారం జరిగిన ఏపీ కేబినెట్ (AP Cabinet) సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అందులో భాగంగా అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల మార్పునకు సూత్రప్రాయంగా అంగీకరం తెలియజేసింది. రాయచోటి, మదనపల్లెను అన్నమయ్య కొత్త జిల్లాకు మార్చింది. అదే విధంగా మదనపల్లెను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఆమోదించింది. అదే విధంగా రాజంపేటను కడపకు మార్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అదే విధంగా కొత్తా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు పచ్చ జెండాను ఊపింది. అందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఎల్లుండి విడుదల చేయనుంది. జిల్లాల పునర్విభజన తరువాత రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. అయితే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కాకుండా మదనపల్లెను చేయడం పై ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సీఎం చంద్రబాబు నాయుడు రాయచోటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని హామీనిచ్చారు. ఎజెండాలపై మంత్రివర్గ సమావేశం ముగియగా, రాజకీయ అంశాలపై చర్చ కొనసాగుతోంది.






