- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Budget: పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు తీపికబురు.. అసెంబ్లీలో పయ్యావుల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ 2026-27 బడ్జెట్‌లో పోలీస్ శాఖకు మంత్రి పయ్యావుల కేశవ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశంపై సభలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉంది. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో వ్యవసాయ రంగానికి మొత్తంగా రూ.11,745 కోట్ల కేటాయింపులు చేశారు. అంతేకాకుండా పంట బీమా కోసం రూ. 250 కోట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న 'ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన' పథకానికి రూ.190 కోట్లను బడ్జెట్‌లో కేటాయించడం విశేషం. అదేవిధంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మున్సిపల్ శాఖకు రూ. 14,339 కోట్లను కేటాయించారు.
రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్ (Police Department)కు మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీసు శాఖ వాహనాల కొనుగోలు కోసం రూ.3 వేల కోట్లను త్వరలోనే అందించబోతున్నామని సభలో ప్రకటించారు. కొత్త ఏపీ పోలీస్ అకాడమీ ఏర్పాటు కోసం 94 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర స్కాలర్‌షిప్‌లకు గాను రూ.3,836 కోట్ల నిధులను మంత్రి పయ్యావుల వార్షిక బడ్జెట్‌లో కేటాయించారు.






