Assembly Sessions : ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ ఐదో సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల (ఫిబ్రవరి) 11వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.

Assembly Sessions : ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ ఐదో సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల (ఫిబ్రవరి) 11వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.

గవర్నర్ ప్రసంగంతో శ్రీకారం

ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాల్‌లో ఉభయ సభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం, ఆయనకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి 12న చర్చ ప్రారంభమవుతుంది. ఈ చర్చకు 13వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాధానం ఇవ్వనున్నారు. ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన 2026-27 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సుమారు నాలుగు వారాల పాటు సాగనున్న ఈ సమావేశాల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతో పాటు, పలు కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది.

Next Story