- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap budget session: అప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో ఖరారు
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో సభాపతి కార్యాలయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు.

దిశ డైనమిక్ బ్యూరో : ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో సభాపతి కార్యాలయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం(BAC meeting) నిర్వహించారు. వచ్చే నెల 21వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు (Ap budget session) నిర్వహించేందుకు నిర్ణయించారు. 19వ తేదీ నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. అవసరమైతే మరో రెండు రోజుల సభ నిర్వహించే వెసులుబాటు కల్పించారు. చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్, విష్ణుకుమార్ రాజు, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు అజెండాను ఖరారు చేశారు. ఈనెల 28న వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మార్చి 21 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. అమతకు ముందు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్(Governer) ప్రసంగించారు. అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్‌కు సభాపతి అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. సభకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వైసీపీ ఎమ్మేల్యేలు హాజరైనా పది నిముషాలు పాటు ఉండి వెళ్లిపోయారు.






