AP Budget: రాజధాని అమరావతికి మహర్దశ.. బడ్జెట్‌‌లో భారీగా నిధుల కేటాయింపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-14 07:22:42  IST  )

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3.32 లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రాజధాని అమరావతి అభివృద్ధికి ఊహకందని నిధులు కేటాయించారు.

AP Budget: రాజధాని అమరావతికి మహర్దశ.. బడ్జెట్‌‌లో భారీగా నిధుల కేటాయింపు
X

దిశ, వెబ్‌డెస్క్: శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్‌ ఇవాళ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇందులో రాజధాని అమరావతికి పెద్దపీట వేశారు. క్యాపిటల్ సిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా అంతర్జాతీయ సంస్థలకు హబ్‌గా ఉన్న విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్‌కు రూ. 28 వేల కోట్లు కేటాయించారు. ఇక నారా లోకేశ్ మంత్రిగా ఉన్న విద్యా శాఖకు రూ.32,308 కోట్లు ప్రకటించడం పట్ల రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

AP Budget: రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు.. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల ప్రకటన

Next Story