- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Budget: 2026-27 వార్షిక బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం..
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 2026-27 వార్షిక బడ్జెట్‌కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. సుమారు రూ.3.46 లక్షల కోట్ల నుంచి రూ.3.50 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు, సీఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌ను కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు అసెంబ్లీకి బయలుదేరారు. సరిగ్గా 11:15కు అసెంబ్లీలో బడ్జెట్‌ను పయ్యావుల కేశవ్, శాసన మండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఈ ఏడాది బడ్జెట్ సుమారు రూ.3.46 లక్షల కోట్ల నుంచి రూ.3.50 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
AP Budget: రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు.. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల ప్రకటన
- Tags
- AP Budget 2026-27
- Andhra Pradesh Cabinet
- CM Chandrababu Naidu
- Deputy CM Pawan Kalyan
- Payyavula Keshav
- Vangalapudi Anitha
- Velagapudi Secretariat
- AP Assembly Budget Session
- Annual Budget Estimates
- 3.50 Lakh Crores
- Finance Minister
- Legislative Council
- CS Neerabh Kumar Prasad
- Andhra Pradesh Government
- Cabinet Approval
Next Story






