- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Budget 2024: పూర్తిస్థాయి బడ్జెట్ పై... ఏపీ ప్రభుత్వం కసరత్తు.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే విషయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే విషయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ పూర్తి స్థాయి బడ్జెట్ ను సెప్టెంబర్ నెలలో ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు ఆర్ధిక శాఖ వివిధ శాఖలతో వరుస సమావేశాలు జరుపనుంది. దీంతో బడ్జెట్ అంచనాలు పంపాలని కోరుతూ అన్నిశాఖల ఉన్నతాధికారులకు ఆర్ధిక శాఖ సర్క్యులర్ కూడా జారీ చేసింది. కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని అంచనాలు పంపాల్సిందిగా ఆర్ధిక శాఖ సూచనలు చేసింది. ఇక, ఈ నెల 31 వ తేదీ లోగా అన్ని శాఖలు బడ్జెట్ అంచనాలను పంపాలని.. ఆర్ధిక శాఖ కోరినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో ఏపీ ప్రభుత్వం నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. మరొక వైపు.. జులై 23 న కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి చేసిన కేటాయింపులకు సంబంధించిన నిధులను, వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇంకా కేంద్ర ఆర్ధిక శాఖమంత్రి నిర్మల సీతారామన్, హోమ్ మంత్రి అమిత్ షా లకు ఇదే విషయాన్ని తెలిపినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.






