ఏపీ బ్రాండ్ అంబాసిడర్ సీఎం వైఎస్ జగన్

by Chukka Sudharani |

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశంసల జల్లు కురిపించారు.

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ సీఎం వైఎస్ జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో ఇంత పెద్ద సమ్మిట్ జరుగుతుందంటే అందుకు సీఎం జగనే కారణమని చెప్పుకొచ్చారు. ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ అని కొనియాడారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 సదస్సులో పాల్గొన్న ఆయన వైఎస్ జగన్ ఛరిష్మాతోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతుందని అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఉత్తరాంధ్రలో పారిశ్రామీకరణకు సైతం సీఎం జగన్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతోందని వెల్లడించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం మీదుగా ఆరు లైన్ల హైవే ఏర్పాటు ముఖ్య భూమిక పోషిస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పుకొచ్చారు.

Next Story