ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంట తీవ్ర విషాదం

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది.

ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంట తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. ఆయనకు మాతృవియోగం కలిగింది. సీఎం రమేశ్ తల్లి రత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రత్యేక విమానంలో ఆమె భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి కడపకు తరలించనున్నారు. సోమవారం (నవంబర్ 24) సాయంత్రం వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్ల మండలం పొట్లదుర్తిలో రత్నమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, బీజేపీ నేతలు రత్నమ్మ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

Next Story