తెలంగాణ అల్లూరి బండి సంజయ్: ఏపీ నేతల ప్రశంసలు

by Vemula.Srinu Prasad |

తెలంగాణలో ఆంధ్రా అల్లూరి సీతారామరాజు లాంటి వ్యక్తి బండి సంజయ్ ‌అని ఏపీ బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు అన్నారు..

తెలంగాణ అల్లూరి బండి సంజయ్: ఏపీ నేతల ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో ఆంధ్రా అల్లూరి సీతారామరాజు(Andhra Alluri Seetharama Raju) లాంటి వ్యక్తి బండి సంజయ్ ‌అని ఏపీ బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు అన్నారు. విశాఖ పార్క్ హోటల్ సర్కిల్(Visakhapatnam Park Hotel Circle) వద్ద వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభలో కేంద్రమంత్రి బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు మాధవ్, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్ యాదవ్, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రసంగించారు. బండి సంజయ్ ఓ ఫైర్ బ్రాండ్ అని, తమకు చాలా ఇష్టమైన నాయకుడు అని గంటా శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ పెను సంచలనం బండి సంజయ్ అని సత్యకుమార్ యాదవ్ పొగడ్తలతో ముంచేశారు.


కాగా వాయిపేజ్ విగ్రహావిష్కరణ ముందు విశాఖకు చేరుకున్న బండి సంజయ్‌ను వైజాగ్ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు నివాసంలో బండి సంజయ్‌కు అల్పాహర విందు ఏర్పాటు చేశారు. అనంతర బండి సంజయ్ చేతుల మీదుగా సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఆ తర్వాత వైజాగ్ భీమిలీ రోడ్డులోని ‘‘శ్రీ మొగ దారమ్మ’’ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వైజాగ్ సభలో పాల్గొన్నారు.

Next Story