- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు.. తమిళ సర్కార్‌పై AP బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
విజయవాడలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు(National Hindu Religious Conference) నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు(National Hindu Religious Conference) నిర్వహించారు. ఈ సదస్సులో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్(AP BJP chief Madhav) పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాలు, గోవులను రక్షించాల్సిన బాధ్యత అందరిమీదా ఉందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ పనిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఆలయాలపై జరిగిన దాడులపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సనాధర్మం కోసం పోరాటం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై తమిళనాడులో క్రిమినల్ కేసు పెట్టడం దారుణమన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న వారిపై తమిళనాడు ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. రాయచోటిలో ఉగ్రలింకులపై లోతుగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మరింత నిఘా పెంచాలని కోరారు.
కాగా, తమిళనాడులోని మధురై నగరంలో ఇటీవల మురుగన్ భక్తుల సమ్మేళనం(Murugan Manadu) జరిగింది. ఈ ఆధ్యాత్మిక సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అయితే.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించటంతో పాటుగా..రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసును నమోదు చేశారు. పవన్‌తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే.అన్నామలై, హిందూ మున్నాని నాయకులపై కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.






