- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. బాంబ్ పేల్చిన ఏపీ బీజేపీ చీఫ్
ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case)పై బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case)పై బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్‌లో జగన్(Jagan) అరెస్ట్ కాబోతున్నాడంటూ బాంబ్ పేల్చారు. చేసిన తప్పులు జగన్ బయటకు చెప్పుకోలేకపోతున్నారని విమర్శించారు. ఆ భయంతోనే జగన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మిథున్‌రెడ్డితో పాటు ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు.. వెంకటేష్ నాయుడు, నవీన్, ధనుంజరు, కృష్ణమోహన్, గోవిందప్పల బెయిల్ పిటిషన్లపై విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ల బెయిల్ పిటిషన్లపై విచారణను జూలై 31వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర సిట్ అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.






