ఆ 56 మంది పదవీకాలం పొడిగింపు.. Ycp Government కీలక ఉత్తర్వులు

by srinivas |
ఆ 56 మంది పదవీకాలం పొడిగింపు.. Ycp Government కీలక ఉత్తర్వులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్‌ చైర్మన్ల పదవీ కాలం పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 56 మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవి కాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి కార్పొరేషన్‌లో ఒక చైర్‌పర్సన్‌తోపాటు 11 మంది డైరెక్టర్లని నియమించారు. వీరి పదవీ కాలం రెండు సంవత్సరాలని అప్పటి ఉత్తర్వుల్లో ప్రకటించారు. తాజాగా వీరి కార్పొరేషన్ల పదవీ కాలాన్ని మరోసారి పొడిగించారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించడం పట్ల బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : అంతవరకు రానివ్వద్దు .. ప్రభుత్వానికి Ap Jac Amaravati హెచ్చరిక

Next Story