AP Bandh : 12న ఏపీ బంద్ కు పిలుపు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-04 05:34:03  IST  )

1/70 భూబదాలయింపు నిషేద చట్టం సవరణ చేయాలన్నఅసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యల(Speaker Ayyannapatrudu's Comments)కు నిరసనగా ఈనెల 12 న మన్యం బంద్ కు ఆదివాసీ జెఏసీ(Adivasi JAC) పిలుపునిచ్చిందని (Called)రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు(Vice Chairman Mottadam Rajababu) తెలిపారు.

AP Bandh : 12న ఏపీ బంద్ కు పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: 1/70 భూబదాలయింపు నిషేద చట్టం సవరణ చేయాలన్నఅసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యల(Speaker Ayyannapatrudu's Comments)కు నిరసనగా ఈనెల 12 న మన్యం బంద్ కు ఆదివాసీ జెఏసీ(Adivasi JAC) పిలుపునిచ్చిందని (Called)రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు(Vice Chairman Mottadam Rajababu) తెలిపారు.ఏపీ వ్యాప్తంగా మన్యం జిల్లాల బంద్ లో ప్రతి గిరిజనుడు పాల్గొనాలని జేఏసీ పిలుపునిస్తుందని తెలిపారు.

జనవరి 27వ తారీఖున విశాఖపట్నంలో ఆంధ్ర ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టం సడలిస్తే ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని, వివాదస్పదమైన వ్యాఖ్యలపై ఆదివాసీ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఎసీ ఆధ్వర్యంలో మన్యం బంద్ కు పిలుపునిచ్చిందన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా , చట్టాన్ని సడలించాడం సరైంది కాదని ఆదివాసీ జేఏసీ భావిస్తుందని స్పష్టం చేశారు. భూబదాలాయింపు నిషేధ చట్టం సవరిస్తే షెడ్యూల్ ప్రాంతం పూర్తిగా నాశనమౌతుందని, చట్టం ఉన్నప్పుడే అమలు చేయకపోవడంతో ఉల్లంఘన జరుగుతోందని, చట్టమే సవరిస్తే మన్యానికి అధోగతేనని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆదివాసీల పోరాటాలతో భూ బదలాయింపు నిషేధ చట్టం 1917లో బ్రిటీష్ ప్రభుత్వం హయాంలోనే వచ్చిందని, స్వాతంత్ర్యం అనంతరం 1959లో 1970లలో మరిన్ని సవరణలు చేసి చట్టం కఠిన తరం చేసారని గుర్తు చేశారు. కానీ అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయ.. 5 వ షెడ్యూల్ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు శాసనన భాపతిగా అయ్యన్న పాత్రుడుకి లేదని, తన పరిధి మించి మాట్లాడమే కాకుండా 170చట్టం గురించి అవగాహన లేదని విమర్శించారు. అయ్యన్న పాత్రుడు శాసనసభాపతి పదవికి అనర్హడని మండిపడ్డారు.

Next Story