- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బనకచర్లపై వెనక్కి తగ్గిన ఏపీ... టెండర్లు రద్దు
బనకచర్లపై ఏపీ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి DPR కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : బనకచర్లపై ఏపీ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి DPR కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రకటించింది. హైదరాబాద్ లో జరిగిన పోలవరం అథారిటీ సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించింది. అంతర్రాష్ట్ర నదీజలాల ఒప్పందాలకు విరుద్ధంగా ఏపీ ఈ ప్రాజెక్టును చేపడుతోందని తెలంగాణ తొలినుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనిపై కేంద్రానికి, CWCకి ఫిర్యాదు చేసింది. న్యాయపోరాటానికీ సిద్ధమైంది.
అయితే అక్టోబర్ 8న టెండర్లు ఆహ్వానించిన ఎపి ప్రభుత్వం.. అక్టోబర్ 22 వరకు టెండర్లకు గడువుగా నిర్ణయించింది. అదే రోజు నుంచి సంస్థలకు టెండర్ డాక్యుమెంట్ అందుబాటులో ఉంచింది. టెండర్ డిపాజిట్‌ను రూ.7.75 లక్షలుగా వెల్లడించిన ఏపీ ప్రభుత్వం.. పని విలువను రూ.9.2 కోట్లుగా పేర్కొంది. అయితే.. టెండర్లపై కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదని.. దాంతో వాటిని ప్రభుత్వం రద్దుచేసిందని తెలుస్తోంది. మరోసారి టెండర్లను పిలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.






