- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP : మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
మద్యం కేసులో నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy), వెంకటేశ్ నాయుడు (Venkatesh Naidu) బెయిల్ పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) సోమవారం విచారించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : మద్యం కేసులో నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy), వెంకటేశ్ నాయుడు (Venkatesh Naidu) బెయిల్ పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) సోమవారం విచారించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ 38 కాగా, వెంకటేశ్ ఏ 34 గా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో మద్యం ముడుపుల సొమ్మును ఓటర్లకు పంచారనే ఆరోపణలతో వీరిపై కేసు నమోదైంది. ప్రస్తుతం నిందితులు విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. గతంలో కూడా పలుమార్లు బెయిల్ కోసం నిందితులు ప్రయత్నించినప్పటికీ కోర్టు వాటిని తిరస్కరించింది. దీంతో మరోసారి నిందితులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
Next Story






