- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap Asembly: వైసీపీ బాయ్‌కాట్.. అసెంబ్లీకి అలా వచ్చి.. ఇలా వెళ్లారు
ప్రతిపక్షంగా గుర్తించండి... ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ వైసీపీ సభ్యులు అసెంబ్లీ లో నినాదాలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రతిపక్షంగా గుర్తించండి...ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ వైసీపీ సభ్యులు అసెంబ్లీ(Ap Asembly)లో నినాదాలు చేశారు. పది నిముషాలకే బాయ్కాట్చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గవర్నర్అబ్దుల్నజీర్ ప్రసంగాన్ని మొదలు పెట్టగానే వైసీపీ సభ్యులు సేవ్‌డెమోక్రసీ అంటూ నినాదాలు మొదలు పెట్టారు. వుయ్వాంట్జస్టిస్అంటూ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. పోడియం వద్దకు వచ్చి నిలుచున్నారు. తొలుత వైఎస్ జగన్ తన సభ్యుల సహా అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కావాలంటూ వైసీపీ మొదటినుంచి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌కు జగన్(YS jagan) లేఖ రాశారు. అక్కడి నుంచి సమాధానం లేకపోవడంతో హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ పిటిషన్పెండింగ్లో ఉంది. దీంతో గత సమావేశాలకు జగన్ హాజరు కాలేదు. ఆయనతో పాటు మిగిలిన సభ్యులు కూడా హాజరు కాలేదు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఉంటుందని వైసీపీ అంటోంది. అయితే నిబంధనల ప్రకారం ఇవ్వడం కుదరని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో జగన్ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే.. వైసీపీ సభ్యులు ప్రతిపక్షంగా గుర్తించండి అంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపటికి అసెంబ్లీ నుంచి బాయ్‌కాట్ చేశారు.






