11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా : స్పీకర్

by Naga Rani Yarlagadda |

చాలాకాలం తర్వాత ఏపీ అసెంబ్లీకి వచ్చిన జగన్.. కొద్దిసేపు మాత్రమే ఉండి వెళ్లిపోయారు.

11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా : స్పీకర్
X

దిశ, వెబ్‌డెస్క్: చాలాకాలం తర్వాత ఏపీ అసెంబ్లీకి వచ్చిన జగన్.. కొద్దిసేపు మాత్రమే ఉండి వెళ్లిపోయారు. అసెంబ్లీ వాయిదా తర్వాత లాబీలో కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలతో ముచ్చటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. వైసీపీ నేతలపై సరదా వ్యాఖ్యలు చేశారు. 11 మంది ఎమ్మెల్యేలు 11వ తేదీన 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా అని సెటైర్లు వేశారు. పైన ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా అసెంబ్లీలో ఉండలేదని వ్యాఖ్యలు చేశారు. సభ్యులు సభా సంప్రదాయాలు పాటిస్తే అందరికీ మంచిదని, వాళ్లు రూల్స్ పాటించకుండా ఇతరులను అనడం మంచిది కాదన్నారు. స్పీకర్ చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీ లాబీలో ఉన్న సభ్యులు నవ్వుకున్నారు.

Next Story