- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిసెంబర్ నాటికి క్వార్టర్స్‌లోకి ప్రజా ప్రతినిధులు : అయ్యన్నపాత్రుడు
ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతి క్వార్టర్స్ లోకి షిఫ్ట్ అవుతారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Assembly Speaker Ayyannapatrudu) తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతి క్వార్టర్స్ లోకి షిఫ్ట్ అవుతారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Assembly Speaker Ayyannapatrudu) తెలిపారు. బుధవారం ఆయన రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణమవుతోన్న క్వార్టర్స్‌ను పరిశీలించారు. అనంతరం అసెంబ్లీలోని ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని నివాసాలను ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించామని తెలిపారు. అలాగే క్వార్టర్స్ ఆవరణలో స్విమ్మింగ్ పూల్, హాస్పిటల్, క్లబ్ హౌస్ కూడా ఉండేలా చూడాలని తెలిపారు. సోలార్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, వేస్ట్ వాటర్‌ను వాడుకునేలా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం 12 టవర్లలో 288 క్వార్టర్లు నిర్మిస్తున్నామని, 35 మంది మంత్రులు, 36 మంది న్యాయమూర్తుల క్వార్టర్స్ వచ్చే ఏడాది మార్చి నాటికికల్లా పూర్తవుతాయని తెలిపారు. ఇక సీఎం ఉండే ఇల్లు, రాజ్ భవన్ కృష్ణానదీ తీరాన ఉంటాయని చెప్పారు. అలాగే ఆగస్టు నెలలో 10 రోజులపాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.






