మత్స్య సంపద, తీరప్రాంత జీవనోపాధికి కృషి.. కేంద్ర మంత్రితో ఏపీ అసెంబ్లీ స్పీకర్ భేటీ

by Ramesh Naini |

న్యూఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయంలో మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడితో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మర్యాదపూర్వకంగా కలిశారు.

మత్స్య సంపద, తీరప్రాంత జీవనోపాధికి కృషి.. కేంద్ర మంత్రితో ఏపీ అసెంబ్లీ స్పీకర్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయంలో మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడితో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరి కలయిక పై కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఏపీ శాసనసభ గౌరవ సభాపతి అయ్యన్నపాత్రుడిని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తాజాగా ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2026 పై, ముఖ్యంగా తీరప్రాంత కార్గో మౌలిక సదుపాయాలు, మత్స్య సంపద వృద్ధి, అలాగే జీడి, కొబ్బరి, గంధం వంటి అధిక విలువ కలిగిన పంటల ప్రోత్సాహం ద్వారా తీరప్రాంత జీవనోపాధులను బలోపేతం చేసే అవకాశాల ఈ భేటీలో విస్తృతంగా చర్చించామన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలు, రాజ్యాంగ విలువలపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన నాకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. నా తండ్రి ఎర్రంనాయుడితో ఆయనకు ఉన్న దీర్ఘకాలిక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భేటీ సాగిందని వెల్లడించారు.

Next Story