- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపట్నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ అప్పుడే
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. దాదాపు గంటసేపు గవర్నర్ ప్రసంగం జరగనున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాక బీఏసీ సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చిస్తారు. 20 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా.. ఈనెల 14వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కాగా.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎస్ విజయానంద్, వివిధశాఖల అధికారులతో సమావేశమై అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సభ్యులు అడిగే ప్రశ్నలు, వాటికి సమాధానాలపై సమీక్షించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు డీజీపీతో పాటు ఉన్నత అధికారులతో కూడా సమావేశమై అసెంబ్లీ సమావేశాలకు కల్పించే భద్రతా ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.






