Flash News: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు .. నోటిఫికేషన్ జారీచేసిన గవర్నర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-05 11:14:10  IST  )

ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Flash News: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు .. నోటిఫికేషన్ జారీచేసిన గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (AP Assembly Sessions) ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 18వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి ప్రారంభం అవుతాయని నోటిఫికేషన్ లో తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో అమలవుతోన్న సూపర్ సిక్స్ (Super Six Schemes) పథకాలపై, ప్రాజెక్టుల నిర్మాణం, అమరావతి అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు. పలు కీలక బిల్లులకు కూడా కూటమి సర్కార్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాగా.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతాయన్న విషయంపై బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.

Next Story