- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FLASH: 10 రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు : మూడు రోజులు సెలవులు
పదిరోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో అధికారపార్టీ నేతలు నిర్ణయించారు.

దిశ, వెబ్‌డెస్క్: పదిరోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో అధికారపార్టీ నేతలు నిర్ణయించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా.. పలువురు నేతలు పాల్గొన్నారు. సెలవు రోజులు, పనిదినాలపై చర్చించారు. ఇక సభలో చర్చించేందుకు 18 కీలక అంశాలున్నట్లు టీడీపీ ప్రతిపాదించింది. సెప్టెంబరు ౩౦ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా.. 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉంటాయని బీఏసీ సమావేశం తీర్మానించింది. 6 ఆర్డినెన్సుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లులను తీసుకురానుంది.
కాగా.. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో శాసన సభ, మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో యూరియా కొరతపై చర్చించాలని వైసీపీ సభ్యులు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా ఛైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు.






