AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ నేతలపై స్పీకర్ అసహనం

by Yella Dhawani Reddy |

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి.

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ నేతలపై స్పీకర్ అసహనం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly) రెండో రోజు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రసంగంపై ఇవాళ (ఫిబ్రవరి 25) ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అయితే సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna patrudu) మాట్లాడుతూ.. తొలి రోజు (ఫిబ్రవరి 23) వైసీపీ ఎమ్మెల్యే ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే ఆందోళనకు దిగటం, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయటం సరికాదన్నారు. సీఎంగా చేసిన వ్యక్తి సభ్యత మరచి ప్రవర్తించాడని వైఎస్ జగన్‌ను (YS Jagan) విమర్శించారు. తన పార్టీ నేతల తీరును నియంత్రించాల్సి పోయి కూర్చుని నవ్వుకుంటారా? అని ప్రశ్నించారు. బొత్స వంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పలేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి వీల్లేదని.. ఇకనైనా జగన్‌ విజ్ఞతతో వ్యవహరించాలన్నారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే మాట్లాడటానికి ఇవాళ అవకాశం ఉన్నా, ఇష్టారీతిన ప్రవర్తించిన తీరు అమోదయోగ్యం కాదన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజాస్వామ్య విలువలు పాటించాలని కోరారు. కాగా, నేటి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరుకావటం లేదు.

Next Story