ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ముహూర్తం ఖరారు

by Thanuru Gopichand |

ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారైంది. ఈనెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ముహూర్తం ఖరారు
X

దిశ డైనమిక్ బ్యూరో : ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారైంది. ఈనెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 15 రోజులు పాటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. మొదటిరోజు బీసీఏ సమావేశంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఈనెల 28న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సభకు పూర్తిస్థాయి సబ్జెక్టుతో రావాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గతంలో రెండు సార్లు ఓట్ ఆన్ బడ్జెట్ తో నెట్టుకొచ్చిన సర్కారు 10 నెలల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడానికి సిద్ధమవుతోంది

Next Story