- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

*నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు*
*ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం*
ఈ నెల 14న ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్*
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి మార్చి 12వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14వ తేదీన బడ్జెట్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది.
అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు !
ఏపీలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ ప్రసంగిస్తారు. ఉదయం 11:30 గంటలకు బీఎస్సీ సమావేశం కూడా ఉంటుంది. ఈ నెల 14వ తేదీన ఏపీ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగానికి హాజరుకావాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తర్వాతి రోజు నుంచి అసెంబ్లీకి వస్తారా? లేదా? అనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇది ఇలా ఉండగా అసెంబ్లీ సమావేశాలలో ప్రజాప్రతినిధులు క్రీడా పోటీలలో పాల్గొంటారట. మార్చి 5వ తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఈ క్రీడా పోటీలు జరగనున్నట్లు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. దీనికోసం శాసనసభ, శాసనమండలి చీఫ్ విప్ లు, విప్ లతో ఒక కమిటీ కూడా వేయనున్నారు. క్రీడా పోటీలను మధ్యాహ్నం నుంచి జరపాలని నిర్ణయించారు. సాంస్కృతిక కార్యక్రమాలను చివరి రోజు సాయంత్రం జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.






