- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ నిరసన
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం నుంచి వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రులు, మండలి చైర్మన్ మోషేన్ రాజు ఒకే వేదిక వద్దకు చేరుకోగా.. జనగణమన ఆలపించారు. అనంతరం సభా సభ్యులకు నమస్కరించగా.. ఎమ్మెల్యేలు, మంత్రులంతా వారికి ప్రతివందనం చేశారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించగా.. వైసీపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సభా హక్కులను కాపాడాలని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. వైసీపీ సభ్యుల నిరసన మధ్యే గవర్నర్ ప్రసంగిస్తున్నారు. కాగా.. అసెంబ్లీ సమావేశాలకు ముందు మంత్రి నారా లోకేష్.. డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. అసెంబ్లీలో పవన్ ఛాంబర్ కు వెళ్లిన లోకేష్.. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు.






