AP Assembly : ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

by Y. Venkata Narasimha Reddy |

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) బడ్జెట్ సమావేశా(Budget Meetings)లు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6న సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగే ఏపీ కేబినెట్(AP Cabinet) సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనేదానిపై చర్చించనున్నారు.

AP Assembly : ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) బడ్జెట్ సమావేశా(Budget Meetings)లు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6న సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగే ఏపీ కేబినెట్(AP Cabinet) సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనేదానిపై చర్చించనున్నారు. అసెంబ్లీ పని దినాలు, బడ్జెట్‌ ప్రవేశ పెట్టె తేదీలను కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నారు. కనీసం 3 వారాలకు పైగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎన్నికల హామీలు..ప్రజల ఆశయాలు, అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటోంది. ఇందులో పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు ఆయా శాఖల నుంచి వచ్చిన పలు కీలక ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వీటిపైనా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్లు మినహా మిగిలిన హామీలు అమలు కాలేదు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎన్నికల్లో చెప్పిన సంక్షేమ పథకాలను ఈ ఆర్ధిక సంవత్సరంలో అమలు చేస్తారా..వాటికి ఎంత మేరకు కేటాయింపులు చేస్తారన్నదానిపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాగే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు పలు కీలక బిల్లుల్ని కూడా సిద్దం చేస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడు వారాలకు పైగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలో బడ్జెట్ సమావేశాలను నాలుగైదు రోజుల పాటు నిర్వహించడాన్ని టీడీపీ, బీజేపీలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతుంది.

అటు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరువుతారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడు సైతం వైఎస్ జగన్‌ను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని పలుమార్లు విజ్క్షప్తి చేశారు. జగన్ అసెంబ్లీకి వచ్చి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలపైన..బడ్జెట్ కేటాయింపులపైన ప్రశ్నించేందుకు సిద్ధపడితే మాత్రం ఈ సమావేశాలను హాట్ హాట్ గా కొనసాగే అవకాశముంది.

Next Story