జీఎస్టీపై ధన్యవాద తీర్మానానికి Ap Assembly ఆమోదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-18 17:20:31  IST  )

జీఎస్టీపై ధన్యవాద తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది....

జీఎస్టీపై ధన్యవాద తీర్మానానికి Ap Assembly ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: జీఎస్టీ(GST)పై ధన్యవాద తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు(CM Chandrababu) సహా సభ్యులందరూ జీఎస్టీ సంస్కరణలను స్వాగతించారు. ఈ మేరకు జీఎస్టీపై ధన్యవాద తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను శుక్రవారానికి వాయిదా వేశారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలపై సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. చివరిగా జీఎస్టీ్ సంస్కరణలకు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. అంతుకుముందు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన కొత్త జీఎస్టీ సంస్కరణలతో, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. ప్రధాని మోదీ గత 11 ఏళ్ళలో తెచ్చిన సంస్కరణలు, అనేక మార్పులకు దారి తీసాయని తెలిపారు. ఇన్ డైరెక్ట్ టాక్స్ పేయర్స్ 132% పెరిగారని, జీఎస్టీ రిసీట్స్ 207% పెరిగాయని, ఇవి సంస్కరణల వల్ల వచ్చిన ఫలితాలని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story