Amaravathi: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఏపీ

by Thanuru Gopichand |   (  Updated:2025-04-28 09:18:36  IST  )

అమరావతి అన్ స్టాపబుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

Amaravathi: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఏపీ
X

* ప్రఖ్యాత యూనివర్సిటీలు రానున్నాయి ..

* టెక్నాలజీని తీసుకొస్తాం..

* దానిని అందిపుచ్చుకునే బాధ్యత యువతదే..

* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

* అమరావతి విట్ లో ప్రసంగం

దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి అన్ స్టాపబుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu) పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలను (VIT univeristy)అమరావతికి తీసుకొస్తామన్నారు. ప్రపంచంలో ఉండే టెక్నాలజీని, నాలెడ్జిని అందుబాటులో ఉంచుతామన్నారు. దానిని అందిపుచ్చుకునే బాధ్యత యువతది అని అన్నారు. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తోన్న 'వి లాంచ్‌పాడ్ 2025 - స్టార్టప్ ఎక్స్‌పో'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు. అలాగే యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ బ్లాక్, వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్‍ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశా.. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నా అని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేది అన్నారు. ఇప్పుడు కలెక్టర్ పోస్ట్ కంటే ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. విట్ అమరావతిలో 95 శాతం ప్లేస్మెంట్లు వస్తున్నాయని తెలిపారు. మీరు ఉద్యోగంతో సంతృప్తి చెందవద్దు.. కొత్త సంస్థలను స్థాపించండి అని పిలుపునిచ్చారు. సిలికాన్ వ్యాలీ కంపెనీల సీఈఓలు ఎక్కువగా తెలుగు వాళ్ళు భారతీయులే అని తెలిపారు. మే 2న ప్రధానమంత్రి అమరావతికి వస్తున్నారని, ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునః ప్రారంభం కాబోతోందని సీఎం తెలిపారు.

1991లో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలనుప్రారంభించారని అన్నారు. సమాజమే దేవాలయం పేదలే దేవుళ్ళు అని నందమూరి తారక రామారావు ఎప్పుడూ చెప్పే వాళ్ళని అన్నారు. దీని కోసమే పీఫోర్ కార్యక్రమాన్ని నేను తీసుకు వచ్చాను అన్నారు. అప్పుడు తాను జన్మభూమికి పిలుపునిస్తే పారిశ్రామికవేత్తలు గ్రామాలకు వచ్చి అద్భుతంగా పనిచేశారని గుర్తు చేశారు. అమరావతికి అత్యుత్తమ యూనివర్సిటీలను తీసుకువస్తున్నట్లు తెలిపారు. అమరావతి తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలో స్టీల్ ప్రొడక్షన్లో మొదటి స్థానంలో విశాఖలో నిలుపుతామన్నారు. అక్కడ కొత్త ఎయిర్పోర్టు, మెట్రో వస్తుందని తెలిపారు. త్వరలో విశాఖపట్నం నుంచి గూగుల్ రాబోతుందని తెలిపారు. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని ఆయన అన్నారు. తిరుపతిని స్పిరిట్చువల్ హబ్ గా తయారవుతుందన్నారు. శ్రీ సిటీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అనంతపురంలో నాలెడ్జి హబ్బును తీసుకొస్తామన్నారు. డిఫెన్స్ కారిడార్లు ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీ ఓర్వకల్లులో వస్తుందన్నారు.

Next Story