AP: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. సర్కార్‌కు హెడ్ కానిస్టేబుల్ సంచలన లేఖ

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-17 06:12:39  IST  )

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

AP: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. సర్కార్‌కు హెడ్ కానిస్టేబుల్ సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్కామ్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy)ని ఇరికించేందకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన గన్‌మెన్ ఏఆర్ మదన్ రెడ్డి (AR Madhan Reddy) సంచలన ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వానికి ఇవాళ సంచలన లేఖ రాశారు. ఆ లేఖలో లిక్కర్ స్కామ్ కేసులో తాము చెప్పినట్టు రాసి.. సంతకం చేయమని సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. తన కంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్లుగా విన్నాడని అధికారులు తనతో అన్నారని తెలిపాడు. అదేవిధంగా విచారణకు తాను యూనిఫాంలో వెళ్లినందుకు తిట్టారని.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉందని చెప్పమన్నారని వివరించాడు. తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వనని చెప్పినందుకు తనపై 10 మంది అధికారులు దాడికి దిగారని.. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు వెళ్లేది లేదని లేఖలో మదన్ రెడ్డి స్పష్టం చేశాడు.


Also Read..

Trending: మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన.. సీఎం చంద్రబాబు సీరియస్

Next Story