- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస అల్పపీడనాలు.. పొంచి ఉన్న వరదల గండం
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నెల 17వ తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వెల్లడించింది. దానికి తోడు తూర్పు, పడమర ప్రాంతాల్లో ద్రోణి విస్తరించనున్నట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు జోరందుకుంటాయని, 18వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గడిచిన రెండు వారాలు మధ్య, ఉత్తర భారతాల్లో చురుగ్గా ఉన్న రుతుపవనాలు రానున్న రెండు, మూడు రోజుల్లో దక్షిణాదిలో బలపడనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది.
తెలంగాణలోనూ ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడ్రోజులు తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడనుండగా.. వాటి ప్రభావంతో వరుస అల్పపీడనాలు ఏర్పడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.






